Header Banner

అమరావతిలో మౌలిక వసతులకు కేంద్రం రూ.2,500 కోట్లు! 25 శాతం గ్రాంట్ గా కేంద్రం..

  Wed Apr 09, 2025 17:00        Politics

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంపై భాజపా ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుందని అన్నారు. ఈ మేరకు ఆమె సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా వీడియో విడుదల చేశారు. "అమరావతి నిర్మాణానికి సంబంధించి డీపీఆర్ సకాలంలో రాకపోయినా ఈ అంశానికి కట్టుబడి అమరావతిలో మౌలిక వసతుల కల్పనకుగాను కేంద్రం రూ.2,500 కోట్లు కేటాయించింది.

 

ఇది కూడా చదవండి: ఇది తమ కుటుంబానికి ఎంతో భావోద్వేగభరితమైన రోజన్న లోకేశ్! ఈ పవిత్రమైన కార్యక్రమంలో..

 

అవుటర్ రింగ్ రోడ్డుకు రూ. 20వేల కోట్లు మంజూరు చేసింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ఇచ్చిన హామీ మేరకు ప్రపంచ బ్యాంకు ద్వారా రూ.15 వేల కోట్లు ఏపీకి ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది. హడ్కో ద్వారా రూ.11 వేల కోట్లు ఏపీకి ఇవ్వడానికి ఒప్పందం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తన వాటాగా రూ.1,400 కోట్లు అందిస్తుంది. రూ.15వేల కోట్ల మొబిలైజేషన్లో 25 శాతం గ్రాంట్గా కేంద్రం ఇస్తుంది. ఇందులో భాగంగా ఇటీవల కేంద్రం రూ.4,285 కోట్లు అందించింది. కేంద్ర సహకారాన్ని అందిపుచ్చుకొని, నిధులను రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవాలి. అమరావతిని అభివృద్ధి చేయాలి" అని పురందేశ్వరి పేర్కొన్నారు.

 

ఇది కూడా చదవండి: NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ మంత్రి హైకోర్టులో షాక్.. ఇక అరెస్టేనా?

 

జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం - క్షమాపణ చెప్పాలని డిమాండ్! పోలీసు సంఘం స్ట్రాంగ్ కౌంటర్!

 

రెండు తెలుగు రాష్ట్రాల‌కు పండగ లాంటి వార్త! గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్న‌ల్‌!

 

ఏపీ ప్రజలకు మరో శుభవార్త.. అమరావతిలో ఇ-13, ఇ-15 కీలక రహదారుల విస్తరణ! అక్కడో ఫ్లైఓవర్ - ఆ ప్రాంతం వారికి పండగే!

 

వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ.. మళ్లీ రిమాండ్ పొడిగింపు!

 

సినీ నటుడు సప్తగిరి ఇంట్లో విషాదం! ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు..

 

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Purandeshwari #SheikhBaji #BJP #BJPLeaders #Delhi